
మది నిండా రంజాన్ శోభ
తుమకూరు: నెల రోజుల పాటు కఠిన ఉపవాసాలు ఉండిన ముస్లిం సోదరులు సోమవారం రంజాన్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించారు. ఉదయమే మసీదులు, ఈద్గాలకు వెళ్లి విశేష ప్రార్థనలు చేశారు. రంజాన్ సందేశాన్ని మతగురువులు వినిపించారు. ఈ సందర్భంగా పిల్లలూ పెద్దలూ పరస్పరం ఈద్ ముబారక్ అని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బెంగళూరులోని ప్రఖ్యాత చామరాజపేట ఈద్గా మైదానంలో వేలాదిగా ప్రార్థనల్లో పాల్గొన్నారు. చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. అన్ని జిల్లాల్లోని ప్రధాన నగరాల్లో రంజాన్ శోభ కనిపించింది. బంధుమిత్రులతో విందు భోజనాలను ఆరగించారు. తుమకూరులో కుణిగల్ రోడ్డులోని ఈద్గా మైదానంలో ప్రార్థనాలు చేశారు. హోం మంత్రి జీ.పరమేశ్వర్, పెద్దసంఖ్యలో మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఎక్కడా అవాంఛనీయాలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో ఈద్ ఆచరణ
అంతటా సామూహిక ప్రార్థనలు

మది నిండా రంజాన్ శోభ

మది నిండా రంజాన్ శోభ

మది నిండా రంజాన్ శోభ

మది నిండా రంజాన్ శోభ

మది నిండా రంజాన్ శోభ