ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక పరిధిలోని బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాల్లో గురువారం నుంచి ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు జరిగాయి. ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని ప్రభుత్వ అదనపు కార్యదర్శి విమలాక్షి ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.
బళ్లారి సీఐకు సీఎం గోల్డ్ మెడల్
బళ్లారి అర్బన్: తమ విధుల్లో ఉత్తమ సేవలు అందించినందుకు పోలీస్ శాఖలో ఈ సారి సీఎం బంగారు పతకానికి బళ్లారి ట్రాఫిక్ సీఐ అయ్యనగౌడ పాటిల్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డీఏఆర్ మైదానంలో బుధవారం ఏర్పాటు చేసిన పోలీస్ ధ్వజారోహణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శోభారాణి చేతుల మీదుగా అయ్యనగౌడ సీఎం బంగారు పతకాన్ని అందుకొన్నారు.
ఎన్‌ఆర్‌బీసీకి ఏప్రిల్ వరకు నీరందివ్వాలి
రాయచూరు రూరల్: నారాయణపుర కుడి కాలువ(ఎన్‌ఆర్‌బీసీ) ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీరందివ్వాలని యాదగిరిలో మాజీ మంత్రి రాజుగౌడ నేతృత్వంలో యాదగిరి బంద్ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. రాయచూరు జిల్లా గబ్బూరులోని నందీశ్వరాలయంలో దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మనాయక్ బుధవారం పూజలు చేసి పాదయాత్రను రాయచూరు వరకు చేపట్టారు. యాదగిరి జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన రాజుగౌడ మాట్లాడుతూ పంటలకు నీటి కొరత రాకుండా చూడాలని ఒత్తిడి చేశారు.
స్నేహితుల మధ్య గొడవ.. ఒకరి మృతి
శివమొగ్గ: స్నేహితుల మధ్య ఏర్పడిన గొడవ ఒకరి మృతికి దారి తీసింది. ఈ ఘటన శివమొగ్గ నగర శివార్లలోని త్యావరెకొప్పలో బుధవారం జరిగింది. వివరాలు.. దేవరాజ్(31)కు, అతని స్నేహితుడు వెంకటేష్ మధ్య చిన్న కారణానికి గొడవ మొదలైంది. ఓ దశలో ఇద్దరూ కొట్టుకున్నారు. వెంకటేష్ కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన దేవరాజ్ అక్కడికక్కడే మరణించాడు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

బళ్లారి సీఐకు సీఎం గోల్డ్ మెడల్

నేటి నుంచి కార్యాలయాల పని వేళల్లో మార్పులు