
ఇకపై హావేరిలో వందే భారత్‌కు స్టాపింగ్
సాక్షి,బళ్లారి: ఏడాది క్రితం బెంగళూరు–ధార్వాడ మధ్య ప్రారంభించిన వందే భారత్ రైలుకు ఇక నుంచి హావేరిలో స్టాపింగ్ కల్పించారు. మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభ్యుడు బసవరాజ్ బొమ్మై కృషితో ఈ రైలు సేవలు వినియోగంలోకి రానున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఽబెంగళూరు నుంచి ధార్వాడ వరకు గతంలో చేరుకోవాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వందే భారత్ రైలు ఏర్పాటు చేయడంతో ఐదు గంటల్లో ప్రయాణం సాగనుండటంతో ఎంతో అనుకూలంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వందే భారత్ రైలు సేవలను కర్ణాటకలో పలు జిల్లాలకు విస్తరించేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హావేరి ఎంపీ కూడా హావేరికి వందే భారత్ రైలు సేవలను కల్పించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కోరడంతో ఆయన సూచనతో కేంద్ర రైల్వే శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రముఖ వాణిజ్య కేంద్రం హావేరికి వ్యాపారులు, రైతులు వచ్చి వెళ్లేందుకు ఎంతో ఇబ్బందులు పడేవారు. ప్రయాణికులకు సౌకర్యం కల్పించే దిశగా వందే భారత్ రైలు సేవలు అందించడంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ వ్యాపార కేంద్రం బ్యాడిగి
జిల్లా వాసుల్లో పెల్లుబికిన హర్షాతిరేకాలు