
పేదలను దోపిడీ చేస్తున్న సర్కార్
హొసపేటె: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, పాల ధరను నిరసిస్తూ విజయనగర బీజేపీ మండలం ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా జరిగింది. బీజేపీ నేత శంకర్ మేటి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయన్నారు. దీంతో ప్రజలు దోపిడీకి గురవుతున్నారన్నారు. వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లాలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయినా ఎమ్మెల్యే లేదా అధికారులు పరిశీలించలేదన్నారు. దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దార్ శృతికి అందజేశారు.