
రంగస్థలంలో తేనెటీగల దాడి
చిక్కబళ్లాపురం: తాలూకా పరిధిలోని రంగస్థలం పుణ్యక్షేత్రంలో వెలసి శ్రీ రంగనాథస్వామి ఆలయంలో సోమవారం భక్తులపై తేనెటీగలు ఆగ్రహించాయి. మైసూరు నుంచి భక్తులు ఆలయానికి వచ్చి రంగనాథున్ని దర్శించుకున్నారు. ఈ సమయంలో హోమం జరపాలని వారు అగ్గి రాజేశారు. అగ్నికీలలు కొంచెం ఎత్తు వరకు లేచాయి, పైన చెట్టు మీద ఉన్న తేనెపుట్టలో అజలడి మొదలైంది. వెంటనే వందలాది తేనెటీగలు లేచి భక్తులపై దాడి చేశాయి. ఈ ఆకస్మిక సంఘటనతో భక్తులు తలోదిక్కుకు పరుగులు తీసినా తేనెటీగలు వదల్లేదు. తీవ్రంగా కుట్టడంతో నొప్పితో కేకలు వేశారు. స్థానికులకు తెలిసి అంబులెన్సును పిలిపించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుమారు పది మంది తేనెటీగల దాడితో ఇబ్బంది పడ్డారు. చికిత్స తరువాత కోలుకున్నారు. చెట్ల మీద తేనెపట్లను తొలగించాలని ఎంతమంది కోరినా ఆలయ సిబ్బంది పట్టించుకోవడం లేదు, దీంతో తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
భక్తులకు అస్వస్థత

రంగస్థలంలో తేనెటీగల దాడి