
కాలువలో పడి ఇద్దరు దుర్మరణం
రాయచూరు రూరల్: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) కాలువలోకి కాలు జారి పడి ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన సోమవారం రాయచూరు తాలూకాలో చోటు చేసుకుంది. మృతులను తెలంగాణలోని గద్వాలకు చెందిన అంజలి(14), వెంకటేష్(13)లుగా గుర్తించారు. ఆదివారం శ్రీరామ నవమి నిమిత్తం పంచముఖి గాణదాళ ఉత్సవాలకు గద్వాల నుంచి భక్తులు తరలి వచ్చారు. కాలువ వద్ద స్నానానికి వెళ్లగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతదేహాల ఆచూకీ కోసం గాలింపు చేపట్టామన్నారు. పిల్లల మరణ వార్త విని తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

కాలువలో పడి ఇద్దరు దుర్మరణం

కాలువలో పడి ఇద్దరు దుర్మరణం