
బెంగళూరులో నీటి చార్జీల బాదుడు
బనశంకరి: రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరు నగరవాసులకు మరోషాక్ ఇచ్చింది. కావేరి జలమండలి నీటిచార్జీలను పెంచింది. మండలి అధ్యక్షుడు రామ్‌ప్రసాత్ మనోహర్ మాట్లాడుతూ బెంగళూరులో నీటి ధరలను పెంచుతున్నట్లు తెలిపారు. ఇళ్లకు వదిలే నీటిపైన లీటర్‌పై పైసా పెంపు, 8 వేల లీటర్ల నీరు వాడేవారిపై లీటరుపై 15 పైసలు పెంపు. 8 వేల నుంచి 25 వేల లీటర్లు వాడేవారికి 40 పైసలు చొప్పున పెంపు, 25 వేల నుంచి 55 వేల లీటర్లు వాడేవారికి లీటరుపై 80 పైసలు పెంచుతామని తెలిపారు. ఇక పై ప్రతి ఏడాది ఏప్రిల్ లో నీటి చార్జీలను సవరిస్తామని చెప్పారు. త్వరలో పెంపు ఉత్తర్వులు వెలువడనున్నాయి.