
ప్రధానీ.. అచ్చే దిన్ ఏవీ?
శివాజీనగర: కేంద్ర ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వంటగ్యాస్ ధర, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రజలపై భారం మోపిందంటూ ఏకంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ ధర్నా చేశారు. గురువారం నగరంలోని ఫ్రీడం పార్కులో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ సుర్జేవాలతో పాటుగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు నిరసన నిర్వహించారు. మన్మోమోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నపుడు నిత్యావసర వస్తువుల ధర ఎంత ఉండేది, ప్రస్తుతం ఎంత అనేది తెలుసుకోవాలి. అచ్చే దిన్ వస్తాయన్నారు, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నల్లధనాన్ని తెచ్చి జనం ఖాతాల్లోకి వేస్తామన్నారు. మూడోసారి ప్రధాని అయినా దాని గురించి మాట్లాడటం లేదు. ముడి చమురు ధర బ్యారెల్‌కు 65 డాలర్లు ఉన్నా కూడా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించడం లేదు. వీటన్నింటితో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది, అందుకే మేము ప్రజల కోసం గ్యారెంటీ పథకాలను ఇస్తున్నాము అని సీఎం, డీసీఎంలు అన్నారు. రైతు, కార్మిక, సామాన్య ప్రజా వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని, ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
సీఎం, డీసీఎం ప్రశ్న
ధరల పెంపుపై ఆందోళన