
కనుల పండువగా వైరముడి బ్రహ్మోత్సవం
మండ్య : జిల్లాలోని మేలుకోటెలో వెలసిన చెలువ నారాయణ స్వామి వారి తీర్థస్నానం అయిన శుక్రవారం సమీపంలోని నారాయణపుర గ్రామంలో ఉన్న కరువు భూమిలో తీర్థోద్భవం జరిగింది. ఈ అద్భుతాన్ని చూడటానికి భక్తులు తరలి వచ్చారు. మేలుకోటెకు సమీపంలో సుమారు 12 కి.మీ. దూరంలో ఉన్న నారాయణపుర అనే గ్రామంలో గ్రామానికి చెందిన దళితుడు కుమార్ అనే రైతు భూమిలో ఒకటి రెండు అడుగులు తవ్వగానే గుంతలో రామానుజాచార్యుల కాలం నుంచి కూడా తీర్థోద్భవం జరుగుతోందని తెలిపారు. ప్రతి సంవత్సరం వైరముడి బ్రహ్మోత్సవం చివరిరోజున శ్రీచెలువ నారాయణ స్వామి వారి దర్శనం, అనుగ్రహానికి ప్రశస్తి అయిన శనివారం 12వ తేదీ తీర్థస్నానం చేసే రోజున ఈ అశ్వర్యకరమైన అద్భుతం జరుగుతుంది. భూ యజమాని శనివారం తీర్థోద్భవం ఉన్నందున శుక్రవారం మధ్యాహ్నం నారాయణపుర గ్రామానికి పరిశీలన కోసం వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ కరువు భూమిగా పేరొందిన ఈ భూమిలో ఎక్కడా కూడా చుక్క నీరు ఉండదని, కాని ఇలాంటి కరువు భూమిలో రెండు అడుగులు కూడా తవ్వకుండానే తీర్థోద్భవం జరిగిందని అన్నారు.