
మంత్రుల శాఖల్లో పుత్రుల ప్రమేయం?
● ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన కాంట్రాక్టర్లు
● చిన్న నీటిపారులల, పీడబ్ల్యూడీ శాఖల్లో జోక్యం
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్‌కు మరోసారి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పాలక మండళిలో ఆధిపత్యం చలాయిస్తున్న అమాత్యుల పుత్రులు, కుటుంబ సభ్యుల జోక్యం మితిమీరిందంటూ గురువారం బెంగళూరులో కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఫిర్యాదు చేశారు. చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు పుత్రుడు రవి, ప్రజా పనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి కుటుంబ సభ్యుల ప్రమేయం అధికమైందని కాంట్రాక్టర్ల సంఘం ఆరోపించింది. కాంట్రాక్టర్లు చేసిన పనులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను పాస్ చేయమని అడిగితే మంత్రుల శాఖలో పుత్రుల, కుటుంబ సభ్యుల ప్రమేయంతో బిల్లులు పాస్ కావడం లేదని ధ్వజమెత్తారు. రూ.కోట్లాది అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే మధ్యవర్తులకు ఒత్తాసు పలుకుతూ అధికారులు బిల్లుల చెల్లింపులకు అమాత్యుల పుత్రులు, కుటుంబ సభ్యులు చెబితేనే ఇస్తామని, అది కూడా 60 శాతం కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.