
ఒకే దూడ, రెండు తలలు
కోలారు: సృష్టిలో వింతలకు లోటు ఉండదు. అలాంటిదే ఈ సంఘటన. ఓ ఆవు రెండు తలల దూడకు జన్మనిచ్చింది. ఈ ఉదంతం కోలారు జిల్లాలోని ముళబాగిలు తాలూకా రామసంద్ర గ్రామంలో జరిగింది. యల్లప్ప అనే రైతుకు చెందిన ఓ జెర్సీ ఆవు ఆదివారం ప్రసవించింది. విచిత్రంగా రెండు తలల దూడ జన్మించింది. దేహం ఒకటే, రెండు తలలు, రెండు నోళ్లు, రెండు చెవులు, నాలుగు కళ్లు కలిగి ఉంది.
వింత దూడను చూడడానికి చుట్టుపక్కల ఊళ్ల నుంచి జనం తండోపతండాలు రైతు ఇంటికి వస్తున్నారు. ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. పశు వైద్యులు వచ్చి ఆవు, దూడ ఆరోగ్యాన్ని పరీక్షించారు. తల్లీ బిడ్డ రెండూ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.
రెండు తలలతో ఆశ్చర్యపరుస్తున్న దూడ