
వైభవంగా కరగ ఉత్సవం
కోలారు: నగరంలోని కఠారు పాళ్యలో ఉన్న ద్రౌపదమ్మ దేవి ఆలయంలో ఆదివారం రాత్రి కరగ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవాలయంలో కరగకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూజారి కరగను తలపై మోసుకుని వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై మేళతాళాలకు అనుగుణంగా చేసిన నృత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో నగర ప్రజలు కరగ ఉత్సవాన్ని చూడడానికి తరలి వచ్చారు. కరగలో వీర కుమారుల గోవింద నామ స్మరణ మారుమోగింది.
దళిత నాయకుల ధర్నా
కోలారు: అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని తమను పరిగణనలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ ఆవణి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సోమవారం ధర్నా చేశారు. ఆవణిలో అంబేడ్కర్ జయంతిని ఆచరించే విషయంలో, తాలూకా కేంద్రానికి పల్లకీని పంపించడంలో దళిత సముదాయాన్ని పంచాయతీ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. పంచాయతీ పీడీఓను బదిలీ చేసి దళిత సముదాయానికి క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. ఫిర్కా కేంద్రం అయిన ఆవణి గ్రామం నుంచి తాలూకాకు పల్లకీని పంపించాల్సి ఉండగా ఈ విషయంలో పీడీఓ దళిత సముదాయాన్ని సంప్రదించలేదన్నారు. అనంతరం టీపీ ఈఓ సర్వేష్ గ్రామానికి వెళ్లి ఆందోళనకారులతో చర్చించి ఆందోళన విరమింప చేశారు.

వైభవంగా కరగ ఉత్సవం