![న్యాయమూర్తి డానీరూత్‌ను సన్మానిస్తున్న న్యాయవాదులు - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/22/21ckm562-191051_mr_0.jpg.webp?itok=tvG_1G_I)
న్యాయమూర్తి డానీరూత్‌ను సన్మానిస్తున్న న్యాయవాదులు
ఖమ్మంలీగల్: బదిలీపై వెళ్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు, న్యాయమూర్తి ఆర్.డానీరూత్‌ను శుక్రవారం ఘనంగా సత్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దిరిశాల కృష్ణారావు ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన సమావేశలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొని వారిని సన్మానించడమే కాక సేవలను కొనియాడారు. అనంతరం జడ్జిలు శ్రీనివాసరావు, డానీరూత్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక్కడ విధినిర్వహణలో న్యాయవాదుల సహకారాన్ని మరువిలేనిదన్నారు. న్యాయమూర్తులు మహ్మద్ అబ్దుల్ జావీద్ పాషా, శాంతిసోని, మౌనిక, పూజిత, న్యాయవాదులు కొల్లి సత్యనారాయణ, మాదిరాజు లక్ష్మీనారాయణ, మన్నేపల్లి బసవయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే, పాస్టర్స్ ఫెలోషిప్ బాధ్యులు కూడా న్యాయమూర్తులు శ్రీనివాసరావు, డానీరూత్‌ను సన్మానించారు. ఖమ్మం పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ వ్యవస్థాపక అధ్యక్షుడు వేముల సత్యంతో పాటు సామ్యేలు, దానియేలు, కె.మోసోపు, మోజెస్, ఎం.రాజు, పి.జెకరయ్య, జోసెఫ్ రామారావు, జార్జి ముల్లర్, రాధాకృష్ణ, అనిల్‌కుమార్, తిమోతీరావు, ఎరీషా పాల్గొన్నారు.
![జిల్లా జడ్జి శ్రీనివాసరావును సత్కరిస్తున్న పాస్టర్స్ ఫెలోషిప్ బాధ్యులు1](https://www.sakshi.com/gallery_images/2023/04/22/21ckm564-191051_mr.jpg)
జిల్లా జడ్జి శ్రీనివాసరావును సత్కరిస్తున్న పాస్టర్స్ ఫెలోషిప్ బాధ్యులు
Comments
Please login to add a commentAdd a comment