ఖమ్మం, సహకారనగర్: కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు (సీయూఈటీ)లో ఖమ్మానికి చెందిన విద్యార్థిని ప్రతిభ కనబర్చింది. జిల్లా కేంద్రంలోని బుర్హాన్‌పురానికి చెందిన వున్నవ రిషిక కేంద్రియ విద్యాలయంలో పదో తరగతి వరకు చదవగా, ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లో పూర్తి చేసింది. ఈ క్రమంలో సీయూఈటీ రాసిన ఆమె 541 మార్కులు సాధించగా.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (షిల్లాంగ్ క్యాంపస్)లోని అన్ని విభాగాల్లో సీటు సాధించింది. తెలంగాణ నుంచి అన్ని విభాగాల్లో సీటు సాధించిన ఏకై క విద్యార్థినిగా రిషిక గుర్తింపు సాధించింది. ఆమె ఈ విద్యా సంవ త్సరం(2023–24) బీఏ హానర్స్ రీసెర్చ్ ఇంగ్లిష్ కోర్సు అభ్యసించాలని నిర్ణయించుకుంది. కాగా, రిషిక తండ్రి ఇంగ్లిష్ ఉపాధ్యాయుడైన కిరణ్‌కుమార్ కరోనా సమయంలో కన్నుమూశాడు. ఐక్యరాజ్య సమితిలో ఉద్యోగం సాధించడమే తన లక్ష్యంగా రిషిక చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment