
తుమ్మల నాగేశ్వరరావు, కోటూరి మానవతారాయ్
సాక్షి, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం మొదలైంది. కాంగ్రెస్ రాష్ట్రంలోని పలు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించగా.. మరికొన్నింటికి ఇంకా ఖరారు చేయలేదు. అయితే, ఖమ్మం అభ్యర్థిగా ఇప్పటికే వెల్లడించిన తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. దీంతో రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనే తొలి నామినేషన్ దాఖలు చేసినట్లయింది. కాగా, కాంగ్రెస్ టికెట్ల ఖరారుకు ముందు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో భాగంగా సత్తుపల్లి టికెట్ ఆశిస్తూ ఆగస్టు 18న కోటూరి మానవతారాయ్ గాంధీభవన్‌లో తొలి దరఖాస్తు అందజేశారు. ఇలా కాంగ్రెస్ టికెట్ కోసం తొలి దరఖాస్తు, తొలి నామినేషన్ ఖమ్మం జిల్లా నుంచే నమోదు కావడం విశేషం. అయితే, మానవతారాయ్‌కు టికెట్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.
ఇవి చదవండి: మౌనంగా ఉండటమా.. లేక బరిలో దిగడమా.. ముంతాజ్ ఖాన్ దారెటు?
Comments
Please login to add a commentAdd a comment