● ఎక్కడున్నా కవలలకు ప్రత్యేక గుర్తింపు ● ఒకే పోలికలతో పలు సందర్భాల్లో తికమక
● నేడు కవలల దినోత్సవం
కవలలు (ట్విన్స్) ఎక్కడున్నా ప్రత్యేకత ఉంటుంది. రూపంలో ఒకేరకంగా ఉండటంతో వారిని ప్రత్యేకంగా చూస్తారు. తల్లిదండ్రులు వారికి ఒకే రకమైన దుస్తులు, వస్తువులు కొనిపెట్టి అపురూపంగా చూసుకుంటారు. ఇష్టాలు, అభిరుచులు ఒకేలా ఉంటే మరికొందరిలో భిన్నంగా ఉంటాయి. బంధువులు, టీచర్లు, ఇరుగుపొరుగు వారు కూడా గుర్తుపట్టలేక తికమకపడుతుంటారు. ప్రపంచంలో మొదటి సారి కవలలు దినోత్సవాన్ని పోలాండ్‌లో 1976లో నిర్వహించారు. మోజస్, అరన్విల్కార్స్ కవలలు ఒకే వ్యాధితో బాధపడుతూ ఒకే రోజు (ఫిబ్రవరి 22) మరణించారు. దీంతో ఏటా ఫిబ్రవరి 22న ప్రపంచ కవలల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
– కొణిజర్ల/నేలకొండపల్లి
Comments
Please login to add a commentAdd a comment