
అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘ఎఫ్‌ఆర్‌ఎస్’ హాజరు
కల్లూరురూరల్: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల హాజును ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం(ఎఫ్‌ఆర్‌ఎస్) ద్వారా నమోదు చేయాలని జిల్లా సంక్షేమాధికారి కీసర రాంగోపాల్‌రెడ్డి తెలిపారు. ఐసీడీఎస్ సీడీపీఓ నిర్మలజ్యోతి ఆధ్వర్యాన కల్లూరు సూపర్‌వైజర్లకు మంగళవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రాలకు వచ్చే ఏడు నెలల నుంచి మూడేళ్ల చిన్నారుల హాజరు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈవిషయమై అంగన్‌వాడీ టీచర్లందరికీ అవగాహన కల్పించాలని చెప్పారు. కాగా, సూపర్‌వైజర్ వెంకటమ్మకు గ్రేడ్–1 సూపర్‌వైజర్‌గా పదోన్నతి పత్రాలను డీడబ్ల్యూఓ అందజేశారు. ఏసీడీపీఓలు రత్తమ్మ, మెహరున్నీసాబేగం, నవ్య, ఉద్యోగులు శివరామకృష్ణ, సంధ్యారాణి, సుజాత, భవాని, వెంకటమ్మ, మల్లేశ్వరి, రాజ్యలక్ష్మి, సత్యవతి, రోజా, రత్నకుమారి, అనురాధ, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment