ప్రాథమిక దశలో గుర్తిస్తే కళ్లకు రక్షణ
ఖమ్మంవైద్యవిభాగం: తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా తొలి దశలోనే గుర్తిస్తే గ్లకోమా బారిన పడకుండా కాపాడుకోవచ్చని ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్.కిరణ్‌కుమార్ తెలిపారు. ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా సోమవారం ఆస్పత్రిలో ప్రత్యేక కంటి వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ తెలియకుండానే కంటి చూపును దెబ్బతీసే గ్లకోమాపై అవగాహన అవసరమని చెప్పారు. కంటి వైద్య నిపుణులు రామూనాయక్ మాట్లాడుతూ వెలుతురు చుట్టూ రంగుల వలయాలు కనిపించడం, కంటినొప్పి, దృష్టి కోల్పోవడం వంటి లక్షణాలే కాక కళ్లకు దెబ్బ తగిలినవారు, స్టెరాయిడ్ వాడేవారు, మధుమేహం, రక్తపోటు బాధితులు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ బి.కిరణ్‌కుమార్, కంటి విభాగం వైద్యులు ఆయేషాబేగం, సీనియర్ రెసిడెంట్లు రాజశేఖర్, ఆస్మా, శ్రావణి, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్లు వీణ, నరేష్, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment