నేడు పొద్దుటూరు, బోనకల్‌ మార్గంలో ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

నేడు పొద్దుటూరు, బోనకల్‌ మార్గంలో ప్రత్యేక బస్సులు

Published Thu, Mar 6 2025 12:29 AM | Last Updated on Thu, Mar 6 2025 12:32 AM

నేడు పొద్దుటూరు, బోనకల్‌ మార్గంలో  ప్రత్యేక బస్సులు

నేడు పొద్దుటూరు, బోనకల్‌ మార్గంలో ప్రత్యేక బస్సులు

ఖమ్మంమయూరిసెంటర్‌: బోనకల్‌ మండలం పొద్దుటూరులో గురువారం బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుండగా ప్రత్యేక బస్సును నడిపిస్తున్నట్లు ఖమ్మం ఆర్టీసీ డిపో మేనేజర్‌ పి.దినేష్‌కుమార్‌ తెలిపారు. ఖమ్మం నుండి కొణిజర్ల, పొద్దుటూరు మీదుగా బోనకల్‌ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. ఖమ్మం పాత బస్టాండ్‌ గురువారం ఉదయం 9–30, మధ్యాహ్నం 12–30, సాయంత్రం 03–30, 6–30 గంటలకు బస్సులు బయలుదేరతాయని, బోనకల్‌ నుండి ఖమ్మంకు ఉదయం 8, 11, మధ్యాహ్నం 2, రాత్రి 8 గంటలకు బస్సులు ఉంటాయని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement