
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు కూసుమంచి మండలం జుజ్జుల్‌రావుపేటలోని శ్రీ సీతారామ స్వామి దేవాలయం ప్రాణ ప్రతిష్ఠా ఉత్సవాల్లో మంత్రి పాల్గొంటారు. ఆతర్వాత క్యాంపు కార్యాలయంలో కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేస్తారు. అనంతరం కూసుమంచి మండలం తురకగూడెం, కేశవాపురం, గోపాల్‌రావుపేట, ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల, ఏదులాపురం మున్సిపాలిటీ బారుగూడెంలో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
ఆడపిల్లలపై వివక్షత చూపించొద్దు..
సత్తుపల్లి: గర్భిణులకు లింగనిర్ధారణ పరీక్షలు చేయడం నేరమే కాక ఆడపిల్లల వివక్షత చూపించడం సరికాదని జిల్లా మహిళా సాధికారిత కోఆర్డినేటర్ ఎస్.డీ.సమ్రీన్ తెలిపారు. సత్తుపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని సిమాంక్ సెంటర్‌లో గురువారం బేటీ బచావో.. బేటీ బడావో.. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆడపిల్లలకు జన్మనిచ్చిన బాలింతలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం లింగనిర్ధారణ నిషేధ చట్టంపై అవగాహన కల్పించిన ఆమె ప్రతిజ్ఞ చేయించారు. డీహెచ్‌ఈడబ్ల్యూ జెండర్ స్పెషలిస్ట్ పి.ప్రమీల, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రమాదేవి, ఉద్యోగులు కె.సతీష్, ఎన్.శారద, వెంకటరావమ్మ, సుజాత, లక్ష్మి పాల్గొన్నారు.
ఈనెల 12న
పాత పార్సిళ్ల వేలం
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం కొత్త బస్టాండ్‌లోని కార్గో సెంటర్ నుంచి నిర్ణీత కాలవ్యవధి దాటినా ఎవరూ తీసుకెళ్లని పార్సిళ్లను ఈనెల 12న వేలం వేయనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల లాజిస్టిక్ మేనేజర్ వి.రామారావు తెలిపారు. కొత్త బస్టాండ్ ఆవరణలో ఈనెల 12న ఉదయం 11గంటలకు వేలం మొదలవుతుందని పేర్కొన్నారు. ముందస్తు డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేనందున, ఎవరైనా పాల్గొనవచ్చని ఆయన తెలిపారు.
విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్ అందించండి
ఖమ్మంసహకారనగర్: విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్ అందించే అదృష్టం ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, టీజీఈ జేఏసీ వైస్ చైర్మన్ దేవరకొండ సైదులు సూచించారు. డీఎస్సీ–2024 లో ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి ఖమ్మం నయాబజార్ ఉన్నత పాఠశాలలో శిక్షణ ఇస్తుండగా గురువారం ఆయన మాట్లాడారు. ఉద్యోగు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం విధానాన్ని రద్దు చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ఎస్‌టీఎఫ్ కృషి చేస్తోందని తెలిపారు. ఎస్‌టీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గండు యాదగిరి, షేక్ మన్సూర్‌తో పాటు బిల్లా సురేష్, పాశం శ్రీనివాసరావు, జల్ల రవి తదితరులు పాల్గొన్నారు.
క్షయ వ్యాధి
నిర్మూలనకు కృషి
కల్లూరురూరల్: క్షయవ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా క్షయ వ్యాధి నోడల్ అధికారి డాక్టర్ జి.రామారావు తెలిపారు. కల్లూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నవ్యకాంత్ ఆధ్వర్యాన కల్లూరు మండలం పేరువంచలో గురువారం నిర్వహించిన అవగా హన సదస్సులో పలువురికి పరీక్షలు చేశాక ఆయన మాట్లాడారు. క్షయవ్యాధి గాలిద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరికై నా వ్యాధి లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోవాలని కోరారు. ఉద్యోగులు వై.సురేష్, సంజీవ్‌కుమార్, పద్మ, కామేశ్వరి, కవెంకట నరసమ్మ, ప్రభావతి, మీనా, సునీత పాల్గొన్నారు.

నేడు మంత్రి పొంగులేటి పర్యటన
Comments
Please login to add a commentAdd a comment