
ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే ఈ ఫలితాలు
ఖమ్మం మామిళ్లగూడెం: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారని సిర్పూర్‌కాగజ్‌నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు తెలిపారు. కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించిన సందర్భంగా గురువారం ఖమ్మంలో బీజేపీ నాయకుడు సన్నె ఉదయ్‌ప్రతాప్ నివాసం వద్ద సంబురాలు నిర్వహించారు. బాణసంచా పేల్చ డంతో పాటు స్వీట్లు పంపిణీ చేశాక హరీశ్‌బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి యువతకు ఉద్యోగాలు లేక, రైతుకు గిట్టుబాటు ధరలు దక్కకకపోగా ఆరు హామీలను సంపూర్ణంగా నెరవేర్చలేదని ఆరోపించారు. అలాగే, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్తే కాంగ్రెస్ మరిన్ని అప్పులు చేస్తోందని పేర్కొన్నారు. ఈ అంశాలన్నీ గమనించిన గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు బీజేపీ అభ్యర్థులను గెలిపించారని తెలిపారు. అనంతరం బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్ మాట్లాడగా నాయకులు దేవకి వాసుదేవరావు, డాక్టర్ శీలం పాపారావు, డాక్టర్ గొంగూర వెంకటేశ్వర్లు, నకిరికంటి వీరభద్రం, మంద సరస్వతి, నున్నా రవికుమార్, పొట్లపల్లి నాగేశ్వరరావు, కొణతం లక్ష్మీనారాయణ, శాసనాల సాయికుమార్, బాషా, సాయి, ప్రభాకర్, మహేందర్ సింగ్, మేకల నాగేందర్, సాగర్, కె.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కాగా, రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముల్క కొమురయ్య, అంజిరెడ్డి విజయం సాధించడంపై ఆ పార్టీ నాయకుడు తాండ్ర వినోద్‌రావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే హరీశ్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment