
కాటమయ్య కిట్‌తో తప్పిన ప్రాణాపాయం
బోనకల్: ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఇటీవల గీతకార్మికులకు అందజేసిన కాటమయ్య కిట్‌తో ఓ గీత కార్మికుడి ప్రాణాలు దక్కాయి. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలకు చెందిన పెద్ద గోవిందు రోజుమాదిరిగానే గురువారం కల్లు గీసేందుకు చెట్టు ఎక్కాడు. కల్లు తీసుకుని ఆయన కిందకు దిగుతుండగా కాలు జారి పట్టు విడిపోగా, కాటమయ్య సేప్టీ కిట్ ధరించి ఉండడంతో అలాగే చెట్టుపై వేలాడసాగాడు. ఈ విషయాన్ని గమనించిన సమీప ప్రాంత రైతులు చేరుకుని ట్రాక్టర్ ట్రాలీపై పైకి లేపి అందులో నిచ్చెన వేసి ఆయన వద్దకు వెళ్లి తాడు అందించారు. ఆతర్వాత అందరూ కలిసి పెద్ద గోవిందును సురక్షితంగా కిందకు దించడంతో ప్రాణాపాయం తప్పినట్లయింది.

కాటమయ్య కిట్‌తో తప్పిన ప్రాణాపాయం
Comments
Please login to add a commentAdd a comment