పంటల వైవిధ్యీకరణపై ఏఈఓలకు శిక్షణ
వైరా: పంటల సాగులో అనుసరించాల్సిన వినూత్న విధానాలపై వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో గురువారం జిల్లాలోని ఏఈఓలకు శిక్షణ ఇచ్చారు. అఖిల భారత సమన్వయ పరిశోధనా సంస్థ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విఽశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యాన సమగ్ర వ్యవసాయ పద్ధతుల విభాగం, మధిర వ్యవసాయ పరిశోధనా సంస్థ, వైరా కేవీకే నేతృత్వంలో శిక్షణ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ వ్యవసాయ పరిఽశోధనా సంస్థఽ ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం. గోవర్దన్, డాక్టర్ సీహెచ్.ప్రగతికుమారి మాట్లాడుతూ గత ఏడాది చింతకాని మండలంలో పలువు రు రైతులు యాసంగిలో జిరో టిల్లేట్ విధానంలో వరికి బదులు మొక్కజొన్న, పెసర, మినుము సాగు చేసి అధిక దిగుబడులు సాధించారని తెలిపారు. వరి తర్వాత దుక్కి దున్నకుండా మొక్కజొన్న సాగు చేసే విధానంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం మరో శాస్త్రవేత్త డాక్టర్ రుక్మిణీదేవి యాసంగిలో వరికి బదులు పప్పుధాన్యాల సాగుతో కలిగే లాభాలను వివరించారు. వైరా కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ కెరవికుమార్, శాస్త్రవేత్తలు డాక్టర్ జె.రవీందర్, డాక్టర్ చైతన్య, డాక్టర్ ఫణిశ్రీ, డాక్టర్ టి.భరత్, డాక్టర్ నాగస్వాతి, డాక్టర్ జి.వినయ్, సాయిబాబా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment