అన్ని ప్రాంతాలకూ మెరుగైన రహదారులు
ముదిగొండ: నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకూ మెరుగైన రవాణా సదుపాయం ఉండేలా రహదారులు విస్తరిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ముదిగొండ నుంచి వల్ల భి వరకు రెండు లేన్లు ఉన్న 5కి.మీ. రహదారిని రూ.28కోట్ల వ్యయంతో నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. ఈ పనులకు భట్టి గురువారం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్‌లో వచ్చిన ఆయనకు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, సీపీ సునీల్‌దత్ స్వాగతం పలికారు. అనంతరం ముదిగొండ సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన భట్టి రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశాక మాట్లాడారు. ఆతర్వాత ఖబరస్తాన్ చుట్టూ ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ముస్లింలు భట్టికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ హేమలత, ఈఈ యుగంధర్, ఆర్డీఓ నర్సింహారావు, సొసైటీ డైరెక్టర్ వనం ప్రదీప్తచక్రవర్తితో పాటు కాంగ్రెస్ నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కొమ్మినేని రమేష్‌బాబు, మందరపు నాగేశ్వరరావు, వల్లూరి భద్రారెడ్డి, పసుపులేటి దేవేంద్రం, తాటికొండ రమేష్, గుడిపూడి ఝాన్సీరాణి, పందిరి అంజయ్య పాల్గొన్నారు.
రోడ్డు విస్తరణకు శంకుస్థాపన చేసిన
డిప్యూటీ సీఎం
Comments
Please login to add a commentAdd a comment