●ఇక కొత్త వేదికపై కల్యాణం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలో ఏటా బ్రహ్మోత్సవాల సమయాన శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణంతో పాటు శ్రీరామనవమికి సీతారాముల కల్యాణం ఇక నుంచి కొత్త వేదికపై జరగనున్నాయి. ఆలయ ప్రాంగణంలో గ్రామానికి చెందిన కేఎన్‌ఆర్ గ్రానైట్స్ అధినేత తుళ్లూరు కోటేశ్వరరావు–నిర్మల రూ.5కోట్ల వ్యయంతో నిర్మించిన శ్రీ వకుళామాత స్టేడియంను శుక్రవారం ప్రారంభించనున్నారు. భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో ఏటా జరిగే సీతారాముల కల్యాణం తరహాలో జమలాపురంలోనూ వేంకటేశ్వరస్వామి కల్యాణం, సీతారాముల కల్యాణం నిర్వహించాలనే ఆలోచనతో స్టేడియం నిర్మించారు. 2019లో హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి శంకుస్థాపన చేయగా ఇటీవలే పూర్తయింది. మూడు రోజులుగా అర్చకులు, వేద పండితుల సమక్షాన దాత కోటేశ్వరరావు దంపతులు యాగం నిర్వహిస్తున్నారు. కాగా, శుక్రవారం జరిగే స్టేడియం ప్రారంభోత్సవంలో వేలాది భక్తులు పాల్గొననున్న నేపథ్యాన ఏర్పాట్లు చేశారు.
జమలాపురంలో సిద్ధమైన
శ్రీ వకుళామాత స్టేడియం
Comments
Please login to add a commentAdd a comment