మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి
ఖమ్మం లీగల్: మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందు వరుసలో నిలవాలని అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి అన్నారు. ఖమ్మంలోని టీటీడీసీలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యాన మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం న్యాయవాదులకు ‘మహిళా సమస్యలు – చట్టాలు’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఉమాదేవి మాట్లాడుతూ ఇంటికి, సమాజానికి వెలుగునిస్తున్న మహిళలు ప్రస్తుతం పురుషులతో సమానంగా రాణిస్తున్నారని తెలిపారు. ఇదే ఒరవడి కొనసాగిస్తూ మరింత ముందుకు సాగాలని సూచించారు. ఈకార్యక్రమంలో న్యాయమూర్తులు అపర్ణ, అర్చనకుమారి రాంప్రసాద్, మురళీమోహన్, ప్రభాకర్, చంద్రశేఖరరావు, కల్పన, శివరంజని దీప, రజిని, బిందుప్రియ, మాధవి, శాంతిలత, కార్తీక్‌తో పాటు విద్యుల్లత, ఐలూ బాధ్యులు కొల్లి సత్యనారాయణ, ఎం. శ్రీనివాస్, వై.శ్రీనివాస్, నాగేశ్వరరావు నవీన్, శ్రీలక్ష్మి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment