
పోలీసు లాంఛనాలతో డీఎస్పీ అంత్యక్రియలు
రఘునాథపాలెం: సిద్దిపేట జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ డీఎస్పీ బానోత్ జవహర్‌లాల్ మృతి చెందగా, స్వగ్రామమైన రఘునాథపాలెం మండలం ఈర్లపుడిలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తదితరులు జహహర్‌లాల్ మృతదేహం వద్ద నివాళులర్పించి ఆయన సోదరుడు, మాజీ మదన్‌లాల్, కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం కమాండెంట్ బి.శివప్రసాద్, అడిషనల్, అసిస్టెంట్ కమాండెంట్లు ఏ.అంజయ్య, ఎస్.కే.రషీద్, ఆర్‌ఎస్‌ఐ ఏ.నవీన్, రఘునాథపాలెం సీఐ ఎస్.కే.ఉస్మాన్ షరీఫ్, ప్రొబెషనరీ ఎస్సై తేజేశ్వర్‌రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో పోలీసు లాంఛనాలతో వారి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బంది, ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు వీరూనాయక్, బచ్చు విజయ్‌కుమార్, గొల్లపూడి హరికృష్ణ, మానుకొండ రాధాకిషోర్, బాషా, శెట్టి రంగారావు, బానోతు బద్రునాయక్, భూక్యా ఉపేంద్రబాయి, స్పందన, జ్యోతి, బోడ వీరన్ననాయక్ తదితరులు కూడా నివాళులర్పించారు. కాగా, జవహర్‌లాల్ మృతిపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు వేర్వేరు ప్రకటనల్లో దిగ్భా్‌ంతి వ్యక్తం చేశారు.
నివాళులర్పించిన మంత్రి తుమ్మల, మాజీ మంత్రి పువ్వాడ
Comments
Please login to add a commentAdd a comment