
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మరో నెలలో పెళ్లికి సిద్ధమవుతుండగా ఘటన
కారేపల్లి: మండలంలోని సూర్యతండా గ్రామానికి చెందిన యువకుడు మహబూబా బాద్ జిల్లా బయ్యారం మండలం మిర్యాలపెంట సమీపాన శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యతండాకు చెంది న బానోతు కళ్యాణ్ (26), అజ్మీరా విజయ్ ద్విచక్రవాహనంపై శుక్రవారం గంగారం మండలం ఒట్టయిగూడెంలో తన స్నేహితుడి పెళ్లికి వెళ్లి రాత్రి తిరిగి వస్తున్నారు. ఈక్రమాన మిర్యాలపెంట వద్ద బైక్ అదుపు తప్పి వాహనం నడుపుతున్న కల్యాణ్‌కు రోడ్డుపక్కన ఉన్న చెట్టు దుంగ బలంగా తాకడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. విజయ్ స్వల్పగాయంతో బయటపడ్డాడు. దీంతో స్థాని కులు వీరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే కళ్యాణ్ మృతి చెందా డు. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని సూర్యతండాకు శనివారం తీసుకొచ్చారు. కాగా, కళ్యాణ్‌కు రెండు నెలల క్రితమే వివాహం నిశ్చయమైంది. హోలీ పండుగ తర్వాత ముహూర్తం పెట్టుకోవాలని భావిస్తుండగానే ఆయన మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment