
పవిత్రమాసం.. రంజాన్
● ఖమ్మంమయూరిసెంటర్: రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని, ముస్లింలు నియమనిష్టలతో ఉపవాస దీక్షలు చేస్తారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం గట్టయ్యసెంటర్‌లోని మజీద్ ఈ హాలీమా ఖాతున్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందులో ఆయన మాట్లాడారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్‌ఎస్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజద్దీన్‌తో పాటు బచ్చు విజయ్‌కుమార్, షంషుద్దీన్, మస్జిద్ కమిటీ బాధ్యులు ఎం.డీ.సాబీర్‌పాషా, ఎం.డీ.మన్నాన్, ఎం.డీ.రజాక్, ఎం.డీ.ఖాజా, జునయీమ్, ఆసిఫ్, జవాద్, అబ్దుల్ గఫార్, ఖాజా మెనుద్దీన్, అబ్బాస్, ముజాహిద్, తోసిఫ్, ఫిరోజ్, మున్నా, చోటు, చంటి తదితరులు పాల్గొన్నారు.
మహిళా సాధికారత కోసం బీఆర్‌ఎస్ కృషి..
మహిళా సాధికారత కోసం బీఆర్‌ఎస్ కృషి చేస్తూ వారికి సముచిత గౌరవం కల్పించామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన కేక్ కట్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ చైర్మన్ భారతీరాణిని సన్మానించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణంతో పాటు కొల్లు పద్మ, బచ్చు విజయ్‌కుమార్, షకీనా, సుజాతరెడ్డి, ఉబ్బలపల్లి నిరోష, ఊర్మిళ, ఝాన్సీ, మాధవి, శైలజ పాల్గొన్నారు.
● ఖమ్మం అర్బన్: ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మానవత్వం చాటుకున్నారు. పువ్వాడ ఖానాపురం వెళ్తుండగా ఖమ్మం – ఇల్లెందు రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. దీంతో ఆయనను ఆస్పత్రికి పంపించడమే కాక వైద్యులకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించేలా సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment