
ఆధునిక విధానాలతో లాభసాటిగా సాగు
వైరా: రైతులు సాగులో ఆధునిక పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించొచ్చని వైరా కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ వి.చైతన్య తెలిపారు. వైరాలోని ఠాగూర్ విద్యాలయంలో శనివారం నిర్వహించిన మహిళా రైతు సదస్సులో ఆమె ముఖ్యఅతిఽథిగా మాట్లాడారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోకపోతే నష్టపోయే ప్రమాదముంటుందన్నారు. కాగా, సాగులో మహిళల శ్రమ అనిర్వచనీయమని కొనియాడారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ కేంద్రం అనుసరిస్తున్న కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్లో మహిళలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ సదస్సులో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేష్, బొంతు రాంబాబుతో పాటు బొంతు సమత, శీలం ఫకీరమ్మ, నర్వనేని పద్మావతి, చింతనిప్పు సులోచన, గాలి అరుణ, దొడ్డపనేని జ్యోతి, కిలారు లక్ష్మి, చింతనిప్పు చలపతిరావు, శ్రీనివాసరావు, మధు, సాంబశివరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
క్లుప్తంగా
Comments
Please login to add a commentAdd a comment