
సేంద్రియ పంటలతో ఆరోగ్యం
ఖమ్మంవ్యవసాయం: సేద్రియ పంటలే ఆరోగ్య కరమని మూలం సంత నిర్వాహకులు గ్రామీణ భారతి, సంయుక్త కిసాన్ మోర్చ ప్రతినిధులు నల్లమల వెంకటేశ్వరరావు, కుతుంబాక మాధవి, అనమోలు రాంరెడ్డి, చెరుకూరి రామారావు, రెట్టచర్ల నాగేశ్వరరావు, కోసూరి ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఖమ్మం నగరంలోని వీడీవోస్ కాలనీ సమీకృత మార్కెట్‌లో మూలం సంత నిర్వహణపై సమావేశం ఏర్పాటు చేయగా నిర్వాహకులు మాట్లాడారు. కొందరు రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఆర్యోగాన్నిచ్చే పంటలు పండిస్తున్నా వారికి ఆదరణ దక్కటం లేదని తెలిపారు. ఆయా పంటలు పండించే వారికి మార్కెటింగ్ సౌకర్యం లేకపోవటం దురదృష్టకరమన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా సేంద్రియ పంటల విక్రయానికి రాష్ట్రంలో మూలం సంతల ఏర్పాటు జరుగుతోందని, జిల్లాలో మూలం సంతపై ప్రత్యేక దృష్టిని సారించామని చెప్పారు. ప్రస్తుతం 23 స్టాళ్లను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌కు మందుగా సేంద్రియ పద్ధతిలో పసుపు పండిస్తూ, పంపిణీ చేస్తూ ప్రాచుర్యం పొందుతున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామ రైతు గంటా దామోదర్‌రెడ్డిని సంత నిర్వాహకులు సత్కరించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు తనను సంప్రదించవచ్చని(99083 84915) దామోదర్‌రెడ్డి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment