
ముగిసిన ఇంటర్ పరీక్షలు
ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారంతో ముగిశాయి. చివరిరోజు 16,476మంది విద్యార్థుల్లో 16,033మంది హాజరుకాగా 443మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ రవిబాబు తెలిపారు. ఇదిలా ఉండగా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న ఇద్దరిని డీబార్ చేయగా, అన్ని పరీక్షల్లో కలిపి నలుగురు డీబార్ అయ్యారని వెల్లడించారు. జిల్లాలోని 35 పరీక్షా కేంద్రాలను హెచ్‌పీసీ, డీఈసీ, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయని ఆయన తెలిపారు.
నేటి నుంచి ఎస్సెస్సీ పరీక్షలు
ఖమ్మం సహకారనగర్: పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి మొదలుకానున్నాయి. జిల్లా నుంచి పరీక్షలకు హాజరుకానున్న 16,788మంది విద్యార్థుల కోసం 97కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లతో అధికారులు సమావేశం నిర్వహించగా, పలు పాఠశాలల్లో గురువారం ఇన్విజిలేటర్లతో సమావేశాలు ఏర్పాటుచేసి సూచనలు చేశారు. ఉదయం 9–30నుంచి 12–30గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, 8–30గంటల నుంచే విద్యార్థులను అనుమతించాలని తెలిపారు. అలాగే, 9–35తర్వాత అనుమతి ఉండనే అంశంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని కేంద్రాల్లో నంబర్లు వేయగా, తాగునీటి వసతి, వైద్యసదుపాయం కల్పిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఈ.సోమశేఖరశర్మ తెలిపారు.
పాఠశాలలకు చేరిన కంప్యూటర్లు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విధానంలో బోధన మొదలైన ఏడు పాఠశాలలకు అవసరమైన కంప్యూటర్లు, సామగ్రి చేరాయని విద్యాశాఖ ఏఎంఓ కె.రవికుమార్ తెలి పారు. ప్రస్తుతం ఇతర పాఠశాలల నుంచి తాత్కాలికంగా మూడేసి కంప్యూటర్లు కేటాయించి బోధిస్తుండగా ఇకపై కొత్త కంప్యూటర్లను విని యోగించనున్నారు. ఇన్వర్టర్లు, వై ఫై రూటర్లు, టేబుళ్లు కూడా రావడంతో పాఠశాలల్లో పూర్తిస్థాయి కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటుకానున్నాయి.

ముగిసిన ఇంటర్ పరీక్షలు