ఖమ్మం సహకారనగర్ : రాష్ట్రంలో ప్రభుత్వం విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గాభవాని కోరారు. నగరంలోని సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పూర్వ ప్రాథమిక పాఠశాలల వల్ల బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక సౌలభ్యం కలుగుతుందని, పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి రెండో వేతన సవరణ సంఘం రిపోర్టును తెప్పించి 2023 జూలై నుంచి నూతన పీఆర్సీ అమలు చేయాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు వల్లకొండ రాంబాబు, జి.వి. నాగమల్లేశ్వరరావు, బుర్రి వెంకన్న, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
దుర్గాభవాని