ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజేఏసీ) జిల్లా కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. ఖమ్మంలోని టీఎన్జీవోస్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్‌గా గుంటుపల్లి శ్రీనివాసరావు, కోకన్వీనర్‌గా టీజీవోస్ జిల్లా అధ్యక్షుడు కస్తాల సత్యనారాయణ ఎన్నికయ్యారు. అలాగే, కోచైర్మన్లుగా పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తుంబూరు సునీల్‌రెడ్డి, పీఆర్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.రాజేష్‌తో పాటు కొణిదన శ్రీనివాస్, మల్లెల రవీంద్రప్రసాద్, చంద్రకంటి శశిధర్, చర్ల శ్రీనివాసరావు, బాబురత్నాకర్, పుల్లయ్య, వరప్రసాద్, సైదులు, బిక్కును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్, కోకన్వీనర్ మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఏప్రిల్ 1నుంచి ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించడంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జేఏసీ ఆధ్వర్యాన చేపట్టే కార్యక్రమాలకు అన్నివిభాగాల ఉద్యోగులు మద్దతు ఇవ్వాలని కోరారు.
టీజేఏసీ జిల్లా చైర్మన్‌గా శ్రీనివాసరావు