పెనుబల్లి : యాభై సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనంతో కలుసుకున్నారు పదో తరగతిలో కలిసి చదువుకున్న స్నేహితులు. వీఎం బంజర జెడ్పీ హైస్కూల్‌లో 1974 – 75 సంవత్సరంలో ఎస్సెస్సీ చదివిన స్నేహితులు అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తుమ్మలపల్లి గ్రామంలో ఏరా కమలాకర్ ఇంటి వద్ద ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో కలిసిన వారి వయస్సు సుమారు 65 ఏళ్లు కాగా నాయకులుగా, అధికారులుగా, అధ్యాపకులుగా, వ్యాపారస్తులుగా కొనసాగుతున్న వారంతా స్నేహితులను చూడగానే పిల్లల్లా మారిపోయారు. ఈ కార్యక్రమంలో ఈడ కమలాకర్, కనగాల వెంకటరావు, దొంతుబోయిన నరసింహారావు, కనకాల సాంబశివరావు, ఎడ్ల వెంకటేశ్వరావు, నాగుబండి వెంకటేశ్వరరావు, మోటపోతుల వెంకటేశ్వరరావు, హైమావతి తదితరులు పాల్గొన్నారు.