పెనుబల్లి: రైస్ మిల్లులో పనిచేస్తున్న కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని అడవిమల్లేలలో శ్రీసాయి లక్ష్మీశ్రీనివాస్ బాయిల్డ్ రైస్ మిల్లులో బిహార్‌కు చెందిన కూలీలు పనిచేస్తుండగా రామ్‌కుమార్(21) గురువారంనుంచి కానరాకపోవడంతో కోదాడలోని ఆయన అన్న వద్దకు వెళ్లి ఉంటాడని సహచరులు భావించారు. ఈమేరకు శుక్రవారం ఉదయం ఆయన సోదరుడికి ఫోన్ చేయగా తన వద్దకు రాలేదని చెప్పడంతో మిల్లు చుట్టుపక్కల వెతుకుతుండగా మామిడి తోటలో చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. ఈమేరక వీఎం బంజర్ ఎస్‌ఐ కె.వెంకటేష్ చేరుకుని మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.