
విశ్వావసు... విశ్వశ్రేయస్సు
ఎన్ని ఉగాదలు పయనించాయో..
ఎన్ని చైత్ర ఉషస్సులు మారాయో
కోయిల స్వరమై.. జీవనసరాగమై
విశ్వావసునామమై చైత్రుడితెచ్చే
షడ్రసోపేతమైన
రసానందంకోసం ఎదురుచూస్తుంది మానవాళి
క్షతగాత్రమైన పుడమిని ఓదార్చడానికి..
ఆత్మవిశ్వాసంతో.. రేపటి బాల భానుడు..
ఉషాకిరణాలతో.. విశ్వావసుడై..
నిండైన వసంతం తోడుగా..
విశ్వశ్రేయసుగా వస్తున్నాడు..
ఉగాది సాక్షిగా
–ఎం.వీ.రమణ, తెలుగు అధ్యాపకులు, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల, ఖమ్మం