
ఆ ఇసుక డంప్‌లు సూర్యాపేట పరిధిలోవి..
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో భారీగా ఇసుక డంప్ చేశారనే సమాచారంతో శుక్రవారం అధికారులు తనిఖీలు చేపట్టారు. అలాగే, మండలంలోని పైనంపల్లి, రామచంద్రాపురంల్లో పరిశీలించి ఉన్న ఇసుక రీచ్‌లను పరిశీలించారు. అయితే, పాలేరు ఏటి ఆవల ఉన్న ఇసుక డంప్‌లు సూర్యాపేట జిల్లా పరిధిలోకి వస్తాయని నిర్ధారించారు. ఆతర్వాత ఏటి మధ్యలో వేసిన రోడ్డును పరిశీలించి ఇసుక తరలింపునకు వేశారా, లేదా అని ఆరా తీశారు. కాగా, రోడ్డు ఎవరు వేశారో తేలాల్సి ఉందని.. కానీ రోడ్డును తొలగిస్తామని స్పష్టం చేశారు. తనిఖీల్లో తహసీల్దార్ జె.మాణిక్‌రావు, ఎంఆర్‌ఐ ఆలస్యం మధుసూధన్‌రావు, ఎస్సై సంతోష్, మైనింగ్ అధికారులు పాల్గొన్నారు.