
మూడు రోజుల వ్యవధిలో దంపతుల మృతి
తిరుమలాయపాలెం: మూడు రోజుల కిందట గుండెపోటుతో భర్త మృతి చెందడాన్ని తట్టుకోలేక భార్య కూడా గుండెపోటుతోనే మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలంలోని ఏలువారిగూడెంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దిండు ఉపేందర్ గత సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆవేదనతో ఉన్న ఆయన భార్య పద్మ (50)ను తిరుమలాయపాలెంకు చెందిన అన్న తురక వెంకన్న తమ ఇంటికి తీసుకొచ్చాడు. అయితే, ఉపేందర్ చిన్న కర్మ చేయాల్సి ఉండడంతో బుధవారం ఏలువారిగూడెం వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలో దంపతుల మృతితో కుటుంబంలోనే కాక గ్రామంలో విషాదాన్ని నింపింది.
‘బీజేపీది నిరంకుశపాలన’
ఖమ్మంవన్‌టౌన్: కేంద్రంలోని బీజేపీ నిరంకుశ పాలన కొనసాగిస్తోందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీపై ఈడీ చార్జిషీట్ దాఖలుకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యాన బుధవారం ఖమ్మంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. తమ పార్టీని నేరుగా ఎదుర్కోలేక నిరాధారమైన ఆరోపణలతో ఈడీని ఉసిగొల్పుతున్నారని పేర్కొన్నారు. బిహార్‌లో జరగనున్న ఎన్నికల దృష్ట్యా కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ నీరజ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేయాలని కుట్ర పన్నిన బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, కార్పొరేటర్లు, నాయకులు మిక్కిలినేని మంజులనరేందర్, మలీదు వెంకటేశ్వర్లు, కమర్తపు మురళి, పాకాలపాటి విజయనిర్మల, లకావత్ సైదులు, రాపర్తి శరత్, కొప్పెర సరిత, మందడపు లక్ష్మీమనోహర్, గజ్జల లక్ష్మి, కన్నం వైష్ణవి ప్రసన్నకృష్ణ, నాగండ్ల దీపక్‌చౌదరి, పాలకుర్తి నాగేశ్వరరావు, కొత్తా సీతారాములు, బాణాల లక్ష్మణ్, షేక్ రషీద్ పాల్గొన్నారు.
నకిలీ వైద్యులపై చట్టరీత్యా చర్యలు
చింతకాని: అర్హత లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి హెచ్చరించారు. మండలంలోని తిమ్మినేనిపాలెంలో ఆరోగ్య ఉప కేంద్రంతో పాటు పలువురు గ్రామీణ వైద్యుల క్లినిక్‌లను బుధవారం ఆమె తనిఖీ చేశారు. కాగా, గ్రామంలోని ఇద్దరు ఆర్‌ఎంపీల వద్ద పెద్ద మొత్తంలో మందులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ఆర్‌ఎంపీ, పీఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తెలిపారు. వీరు ప్రాథమిక చికిత్స తప్ప ఎలాంటి మందులు ఇవ్వొద్దని సూచించారు. అయితే, వీరికి మెడికల్ షాపులే లేకున్నా మెడికల్‌ఏజెన్సీల ద్వారా భారీగా మందులు సమకూర్చుకుంటున్నట్లు తెలుస్తోందని, ఈ విషయాన్ని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని డీఎంహెచ్‌ఓ పేర్కొన్నారు. అనంతరం ఆరోగ్య ఉప కేంద్రంలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సైదులు, డీఐఓ చందూనాయక్, డీఈఎంఓ సాంబశివారెడ్డి, ఎన్‌ఎంసీ రవి పాల్గొన్నారు.

మూడు రోజుల వ్యవధిలో దంపతుల మృతి

మూడు రోజుల వ్యవధిలో దంపతుల మృతి

మూడు రోజుల వ్యవధిలో దంపతుల మృతి