
హీమోఫిలియాపై విస్తృత అవగాహన
ఖమ్మంవైద్యవిభాగం: హీమోఫిలియా వ్యాధి జన్యుపరంగా వచ్చే రక్తస్రావ రుగ్మత అని.. ఈ వ్యాధి లక్షణాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని జిల్లా మాస్ మీడియా అధికారి సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం సందర్భంగా గురువారం మామిళ్లగూడెం యూపీహెచ్‌సీలో ఏర్పాటుటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వ్యాధి రక్తం గడ్డకట్టే సామర్ధ్యంపై ప్రభావాన్ని చూపుతుందని, తద్వారా గాయమైతే ఎక్కువగా రక్తస్రావం అవుతుందన్నారు. ఇలాంటి పరిస్థితులను గుర్తిస్తే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. కాగా, వ్యాధి గుర్తింపు, చికిత్సపై వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన తెలిపారు. ఆతర్వాత అవగాహన ర్యాఈ నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణచైతన్య, హెల్త్ ఎడుకేటర్ అన్వర్, తదితరులు పాల్గొన్నారు.