
పోషకాహారం, చికిత్సతో క్షయకు చెక్
మధిర: క్షయ బాధితులు పోషకాహారం తీసుకుంటూ సరైన చికిత్స చేయించుకుంటే ఆరోగ్యం మెరుగవువుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కళావతిబాయి తెలిపారు. మధిరలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం ఆమె రాజు, కల్యాణి చేయూతతో పౌష్టికాహార కిట్లు అందజేశాక పలు సూచనలు చేశారు. ఆ తర్వాత పీపీ యూనిట్, టీబీ యూనిట్లలో రికార్డులు తనిఖీ చేశారు. వైద్యులు కనకపూడి అనిల్, ప్రేమ్, రామ్మోహన్‌నాయక్, హర్షిత్, అమినాజ్, పృథ్వీరాజ్‌నాయక్, ఉద్యోగులు వెంకటేశ్వర్లు, విజయ్‌కుమార్, లంకా కొండయ్య, సందీప్, శివ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆస్పత్రిలో హీమోఫీలియా వ్యాధిపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో డీఎంహెచ్‌ఓ కళావతిబాయి మాట్లాడారు. మేనరికం వివాహాలతో పిల్లలకు ఈ వ్యాధి సోకుతుండగా, సమస్యలు గుర్తించిన వారు వైద్యులను సంప్రదించాలని కోరారు. అనంతరం అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు.