
పలువురికి కవిత పరామర్శ
ఖమ్మంమయూరిసెంటర్ : రెండు రోజుల ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ఖమ్మం చేరుకున్నారు. ఆమెకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్ పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. వద్దిరాజు నివాసం నుంచి బయలుదేరి బీఆర్‌ఎస్ నాయకులు గుండాల కృష్ణ (ఆర్‌జేసీ) ఇంటికి వెళ్లారు. ఇటీవల అనారోగ్యంతో సర్జరీ అయిన కృష్ణను కవిత పరామర్శించారు. ఆ తర్వాత సీపీఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావును పరామర్శించారు. అలాగే నగరంలో జాగృతి నాయకులు గట్టు అరుణ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరులు సాయి వివేక్–పావనిని ఆశీర్వదించారు. ఆమె వెంట మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ మదన్‌లాల్, బానోత్ హరిప్రియ, బానోత్ చంద్రావతి, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు ఉన్నారు.