
బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తి
ఖమ్మం లీగల్: ఖమ్మం రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తిగా టి.మురళీమోహన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2016లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై న ఆయన తొలుత నాగర్‌కర్నూల్, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా కూకట్‌పల్లిలోని పదో ఎంఎం కోర్టు, మేడ్చల్‌లోని 11 ఏఎంఎం కోర్టులో విధులు నిర్వర్తించారు. అనంతరం పదోన్నతిపై 2024లో రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా మేడ్చల్‌లో విధులు నిర్వర్తిస్తూ బదిలీపై ఖమ్మం వచ్చారు. ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా జడ్జి రాజగోపాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేద్దాం
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పులగం దామోదర్‌రెడ్డి సూచించారు. ఖమ్మంలోని పీఆర్‌టీయూ భవన్‌లో సంఘం జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు అధ్యక్షతన గురువారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షణీయమన్నారు. ఈమేరకు ఉపాధ్యాయులు కూడా తమ వంతు పాత్ర పోషించాలని తెలిపారు. కాగా, సీపీఎస్ రద్దు, పెండింగ్ డీఏలు, పీఆర్సీ మంజూరుకు ఇప్పటికే సీఎంను కలిశామని తెలిపారు. ఈసమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావుతో పాటు మోత్కూరు మధు, కందులు వెంకటనరసయ్య, విజయ్ అమృత్, ఆర్.బ్రహ్మారెడ్డి, కట్ట శేఖర్, రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.

బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తి