
ఆక్రమణలు తొలగింపు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం 43వ డివిజన్‌లో డ్రెయినేజీల ఆక్రమించి పలు షాపుల యాజమానులు ఏర్పాటుచేసిన ర్యాంపులు, ఇతర నిర్మాణాలను కేఎంసీ అధికారులు గురువారం తొలగించారు. ప్రధాన రహదారికి ఇరువైపులా డబ్బాలు, ఇతర నిర్మాణాలతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలను జేసీబీల సహకారంతో కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వసుంధర, ఉద్యోగులు పాల్గొన్నారు.
గోవులను తరలిస్తున్న వ్యాన్లు పట్టివేత
తల్లాడ: తల్లాడ మీదుగా అక్రమంగా గోవులను తరలిస్తున్న వ్యాన్లను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ బి.కొండల్‌రావు ఆధ్వర్యాన వాహనాలు తనిఖీ చేస్తుండగా విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న రెండు ఐషర్ వ్యాన్లు వచ్చాయి. అందులో పరిశీలించగా గోవులు, ఎద్దులు ఉండడంతో హైదరాబాద్ కబేళాకు తరలిస్తున్నట్లు తేలింది. విజయనగరం మానాపురం నుండి నాయుడు అనే వ్యక్తి వీటిని హైదరాబాద్‌లో మహ్మద్ రఫీకి విక్రయించేందుకు వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులను పశువులకు పాల్వంచలోని గోశాలకు తరలించారు. అలాగే, నాయుడు, రఫీతో పాటు వ్యాన్ల యజమానులు, డ్రైవర్లు జాలా రాజు, చుట్టూరి శేఖర్‌గౌడ్, కొల్లి నాగరాజు, బుద్దాల దుర్గాప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.