
రెండు బార్లకు 145 దరఖాస్తులు
ఎకై ్సజ్ శాఖకు రూ.1.45కోట్ల ఆదాయం
ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలో లైసెన్స్ రద్దయిన రెండు బార్ల స్థానంలో కొత్తవి ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానించగా శనివారంతో గడువు ముగిసింది. మొత్తంగా 145 దరఖాస్తులు అందగా, వీటి ద్వారా రూ.1.45కోట్ల ఆదాయం సమకూరింది. ఈనెల 1నుంచి 21వ తేదీ వరకు కేవలం రెండు దరఖాస్తులే అందగా, ఆతర్వాత ఏపీతో పాటు తెలంగాణ వ్యాపారులు ముందుకు రావడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. ఈనెల 29వ తేదీన డ్రా ద్వారా బార్ల నిర్వహణను అప్పగించనున్నారు.
‘ప్రమాదకరంగా ఉన్మాదం’
ఖమ్మం మయూరిసెంటర్: ఉన్మాదం దేశానికి ప్రమాదకరమే కాక అభివృద్ధి, భవిష్యత్‌కు గొడ్డలిపెట్టుగా నిలుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఉన్మాదం, టెరర్రిజానికి మతం ప్రాధాన్యత కాదని అలజడి, ప్రజలను హింసించడమే దాని లక్ష్యమని చెప్పారు. ఖమ్మంకు చెందిన వరద నర్సింహారావు తదితరులు సీపీఐలో చేరిన సందర్భంగా శనివారం ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. ఉన్మాదులకు మతం లేదని పలుమార్లు రుజువైనా, టెరర్రిజం విషయంలో ఒక మతాన్ని బూచిగా చూపడం సరి కాదన్నారు. టెరర్రిస్టు దాడిని అంచనా వేయ డం, అడ్డుకోవడంలో విఫలమై.. ప్రజల ఆలోచనలను మళ్లించేలా మోడీ, అమిత్ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. సీపీఐ నాయకులు బాగం హేమంతరావు, నాయకులు మల్లేష్, దండి సురేష్, మహ్మద్ మౌలానా, జమ్ముల జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.