మెనూ ప్రకారం భోజనం అందించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని గోయగాం ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించారు. మధ్యాహ్నం భోజనం, హాజరు పట్టికను పరిశీలించారు. పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షల తీరును పర్యవేక్షించారు. విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. అనంతరం మండలంలోని ధనోరా వద్ద ఉన్న మిషన్ భగీరథ పంప్‌హౌస్‌ను సందర్శించారు. ఈఈ రాకేశ్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంఈవో ఆడే ప్రకాశ్, ఉపాధ్యాయులు, ఏఈలు ఉన్నారు.
‘ధరణి’ దరఖాస్తులు పరిష్కరించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: వివిధ భూ సమస్యలపై ధరణి పోర్టల్‌లో పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల తహసీల్దార్లతో ధరణి(భూభారతి)లో వచ్చిన సమస్యలపై సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిశీలించి, రికార్డులు సరిచూసి దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. ప్రతీ ఫైల్ వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్డీవో లాగిన్‌లో ఉన్న రికార్డులను త్వరగా పరిష్కరించాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై అధికారులు ప్రతిరోజూ సమీక్ష నిర్వహించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment