సీ్త్రనిధి రుణాలు వందశాతం రికవరీ చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: మహిళా సంఘాల అభివృద్ధిలో భాగంగా అందించే సీ్త్రనిధి రుణాలను మార్చి నెలాఖరులోగా రికవరీ చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం డీఆర్‌డీవో దత్తారావుతో కలిసి ఏపీఎంసీ, సీసీలు, మెప్మా సిబ్బందితో సీ్త్రనిధి రుణాల రికవరీ, నూతన రుణాల జారీ, ప్రమాద బీమా, బ్యాంకు లింకేజీ అంశాలపై సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సీ్త్రనిధి కింద తీసుకున్న రుణాలు, ఓవర్ డ్యూస్ రికవరీ వందశాతం పూర్తి చేసేవిధంగా అధికారులు మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. అధిక బకాయిలు ఉన్న సభ్యులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. వందశాతం రుణాలు చెల్లించిన సంఘాలకు నూతన రుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రతిఒక్కరూ ప్రమాద బీమాకు ప్రీమియం చెల్లించేలా అవగాహన కల్పించడంతోపాటు వందశాతం బ్యాంకు లింకేజీ పూర్తి చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మండలాల వారీగా సమీక్షించారు. అదనపు డీఆర్‌డీవో రామకృష్ణ, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, మెప్మా ప్రాజెక్టు అధికారి మోతీరాం, సీ్త్రనిధి సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment