ఆరోగ్యంపై ప్రతిఒక్కరూ శ్రద్ధ వహించాలి
● ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
ఆసిఫాబాద్‌అర్బన్: పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో బుధవారం హైదరాబాద్ కేర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఈసీజీ, షుగర్, బీపీ, పల్స్‌రేట్, 2డీ ఏకో తదితర వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఆరోగ్యమే మహా భాగ్యమని, ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేసే పోలీసులు ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, డీఎస్పీ కరుణాకర్, సీఐ రాణాప్రతాప్, ఆర్‌ఐ పెద్దన్న, సీఐ రవీందర్, డీసీఆర్డీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సిబ్బంది శంకర్‌రెడ్డి, విజయ్, సీనియర్ ఆర్థో సర్జన్ విశ్వనాథ్, కార్డియాలజిస్ట్ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment