సమస్య ఉంటే సమాచారం ఇవ్వాలి
దహెగాం(సిర్పూర్): విద్యుత్ సరఫరాలో సమస్యలు ఉంటే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని ట్రాన్స్‌కో ఏఈ శేషారావు అన్నారు. మండల కేంద్రంలో గురువారం ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతులు సాగు మోటార్లకు స్టార్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం పంటల సాగుకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. విద్యుత్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో డీఈ నాగరాజు, ఏఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment