‘మధ్యవర్తుల వ్యవస్థపై చర్యలు తీసుకోవాలి’
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కా ర్యాలయంలో కొనసాగుతున్న మధ్యవర్తి వ్యవస్థపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ, టీఏజీఎస్ నాయకులు శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఏవో మధుకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీఏజీఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలశ్రీ, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్ మాట్లాడుతూ జిల్లాలో వాహనాల రిజిస్ట్రేషన్‌లు, లైసెన్స్‌ల కోసం ఆన్‌లైన్‌లో అప్‌లై చేసుకుని ఆర్టీవో కార్యాలయానికి వెళ్తే మధ్యవర్తులతో రావాలని వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వేరే అవకాశం లేక తప్పని పరిస్థితుల్లో మధ్యవర్తులతోనే పనులు చేయించుకోవాల్సి వ స్తోందన్నారు. అమాయకులను ఆసరా చేసుకుని అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారన్నారు. కా ర్యాలయంలో ఏ వాహనానికి ఎంత చలాన్ చెల్లించాలో ధరల పట్టిక కూడా పెట్టడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment